కుళ్లిన మాంసం, చేపలు, రొయ్యలు.. దాంతోనే బిర్యానీ.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాకం..

కుళ్లిన మాంసం, చేపలు, రొయ్యలు.. దాంతోనే బిర్యానీ.. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాకం..

డబ్బు సంపాదనే ధ్యేయం.. ప్రజల ఆరోగ్యంతో మాకేంటి పని.. అన్నట్లుంది బార్లు, రెస్టారెంట్ల పరిస్థితి. కమ్మగా వండి వండిస్తున్నారని అనుకుంటున్నారు కానీ కంపు కొట్టే మాంసంతో బిర్యానీ తయారు చేస్తున్నారని ఊహించలేకపోతున్నారు కస్టమర్లు. అధికారులు దాడులు చేసిన ప్రతిసారి ఇలాంటి అక్రమాలు బయటపడుతూనే ఉంటాయి. అయినా నిర్వాహకుల్లో మార్పు రాదు. మళ్లీ యధా మామూలే. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు నెల్లూరు జిల్లాలో రెస్టారెంట్ యజమానులు, కొన్ని మాంసాహార దుకాణదారులు. జిల్లాలో కల్తీ ఆహారాన్ని ప్రజలకు అందిస్తున్న బిరియానీ హౌస్, సింహపురి రుచులు హోటళ్లపై రెండు రోజుల క్రితం నగరపాలక సంస్థ అధికారులు దాడులు చేసారు.

ఫ్రిజ్‌లో తీస్తున్న కొద్దీ కుళ్లిపోయిన మాంసం, రంగులు పూసిన మాంసాన్ని చూసి అధికారులు విస్తుపోయారు. నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్దగల శ్రీ సూర్య బార్ అండ్ రెస్టారెంట్‌లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన కోడి, పొట్టేలు మాంసం, రొయ్యలు, చేపలు బయటపడ్డాయి. అధికారులు స్వాధీనం చేసుకుని రూ.50వేల జరిమానా విధించారు. అక్కడి నుంచి గౌడ్ బార్ అండ్ రెస్టారెంట్‌ను తనిఖీ చేసి బూజు పట్టి కుళ్లిపోయిన మాంసం, చేపలు, రొయ్యలను స్వాధీనం చేసుకుని వారికి కూడా రూ.50 వేలు ఫైన్ వేశారు. వహాబ్‌పేట్‌లోని పరివార్ భవన్‌లో దాదాపు 30 కేజీలు, రియాజ్ హోటల్, చారి వీధిలోని మొగల్ దర్బార్‌లో తనిఖీ చేసిన అధికారులు భారీగా నిల్వ చేసిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మాగుంట లేవుట్‌లోని రాజ్ దర్బార్‌లో కూడా నిల్వ ఉంచిన మాంసం బయటపడింది. నగరంలోని కొన్ని హోటళ్లను తనిఖీ చేసి దాదాపు 500 కేజీల నిల్వ ఉంచిన మాంసాన్ని కనుగొన్నారు అధికారులు. ఈ మాంసం మొత్తాన్ని నగరపాలక సంస్థ వ్యానులో ఊరి శివారులకు తరలించారు. ఈ సందర్భంగా నగరపాలకసంస్థ కమిషనర్ పీవీవీఎస్ మూర్తి మాట్లాడుతూ హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు ప్రజల ఆరోగ్యంతో చెలగాడమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు హోటళ్లకు 24 గంటలు సమయం ఇచ్చామని తీరు మారకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story