సిద్ధార్థ ఆత్మహత్యపై ఆనంద్ మహీంద్రా భావోద్వేగం..

సిద్ధార్థ ఆత్మహత్యపై ఆనంద్ మహీంద్రా భావోద్వేగం..
X

ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అన్నీ తెలిసిన వ్యక్తులు కూడా ఇలా చేయడం బాధాకరం. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలంటూ ఆనంద్ మహీంద్రా పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్దార్థ ఆత్మహత్య పై మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. వ్యాపారంలో నష్టం వస్తే ప్రత్యామ్నాయం ఆలోచించాలి.. అంతేకాని ఇలా ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ఆత్మహత్యలు చేసుకోవద్దని అన్నారు. వ్యాపారం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. వాటన్నింటిని తట్టుకుని సంస్థ మీద ఆధారపడే వారికి భరోసాని ఇవ్వాలి. ఎప్పటికప్పుడు లాభనష్టాలను అంచనావేసుకుంటూ ముందడుగేయాలి. నలుగురికీ మార్గ దర్శకులు కావాలి. " నాకు ఆయన గురించి తెలియదు. ఆయన ఆర్థిక పరిస్థితులపై అవగాహన కూడా లేదు. నాకు తెలిసింది మాత్రం పారిశ్రామిక వేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మగౌరవాన్ని నాశనం చేసే అవకాశం ఇవ్వొద్దన్నారు. ఇది పారిశ్రామికరంగం అంతానికి దారి తీస్తుంది.. అని ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేశారు.

Next Story

RELATED STORIES