సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం యడియూరప్ప..

సంచలన నిర్ణయం తీసుకున్న సీఎం యడియూరప్ప..

కర్ణాటకలో మరోసారి టిప్పు సుల్తాన్ వివాదం రాజుకుంది. చరిత్రకు మతాన్ని ముడేయటంతో కర్ణాటక రాజకీయం వేడెక్కింది. టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను నిర్వహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు సీఎం యడియూరప్ప. నాలుగోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన యడియూరప్ప ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేశారు. ఏటా నవంబర్ 10న నిర్వహించే టిప్పూ జయంతి ఉత్సవాలను ఈ ఏడాది జరపరాదంటూ కన్నడ సాంస్కృతిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. బీజేపీ సర్కారు మతతత్వ ధోరణికి ఈ నిర్ణయం ఓ ఉదాహరణ అని సిద్ధరామయ్య ఓ రేంజ్ లో విమర్శించారు. టిప్పూ జయంతి వేడుకలను తానే ప్రారంభించానని ఆయన గుర్తు చేశారు. భారతదేశంలో మొదటి స్వాతంత్య్ర సమరయోధుడు టిప్పు సుల్తానే అని సిద్ధ రామయ్య యడియూరప్ప ప్రభుత్వానికి చరిత్ర చెప్పుకొచ్చారు.

టిప్పు జయంతి ఉత్సవాలపై కర్ణాటకలో తీవ్ర వివాదం నెలకొంది. టిప్పు ఉత్సవాల నిర్వహణపై హిందూత్వ సంఘాలు భగ్గుమంటున్నాయి. గత ఏడాది కూడా టిప్పు ఉత్స వాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నా యి. బెంగళూరు, మైసూరు, మడికెరి, కొడగు, శివమొగ్గ, ధార్వాడ్, హుబ్లీ తదితర ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు 144 సెక్షన్ విధించి, లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చింది. కొన్ని చోట్ల భాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు.

వాస్తవానికి 2013 వరకు కర్ణాటకలో టిప్పూ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే సంప్రదాయం లేదు. 2013లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానం మొదలైంది. నాటి ముఖ్య మంత్రి సిద్ధరామయ్య, టిప్పు జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ ఆదేశాలపై హిందూత్వ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. సంఘ్ పరివార్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేశాయి. ఇక, 2018లో గద్దెనెక్కిన కుమారస్వామి కూడా సిద్ధరామయ్య ప్రభుత్వ ఆదే శాలను అమలు చేశారు. ఫలితంగా రాష్ట్రంలో అలర్లు చెలరేగాయి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన యడియూరప్ప, టిప్పూజయంతి వేడుకలకు బ్రేక్ వేశారు.

Tags

Read MoreRead Less
Next Story