కృష్ణా నదికి వరద ప్రవాహం..

కృష్ణా నదికి వరద ప్రవాహం..

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి వరద ప్రవాహం కొనసాగుతోంది.. ఎగువన వున్న ఆల్మట్టి నారాయణపూర్‌ ప్రాజెక్టు నుంచి జూరాల రిజర్వాయర్‌కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.. రెండు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో జూరాల ప్రాజెక్టు 12 గేట్లను ఒక మీటరు మేర ఎత్తి 74వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.. దీంతో శ్రీశైలం దిశగా కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.6 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 8.6 టీఎంసీలకు చేరింది.. నిన్న జూరాల ప్రాజెక్టులోని కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేశారు.. మూడు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.. చాలా రోజుల తర్వాత జూరాల గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది.

Tags

Read MoreRead Less
Next Story