నేడు దేశవ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రుల బంద్

దేశవ్యాప్తంగా ఇవాళ ప్రైవేటు ఆసుపత్రులు బంద్ పాటిస్తున్నాయి. అత్యవసర సేవలు మినహా.. 24 గంటల పాటు ఇతర వైద్యసేవలు లభించవు. లోక్‌సభలో జాతీయ వైద్య కమిషన్ బిల్లును ఆమోదించినందుకు నిరనసగా.. 24 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది భారతీయ వైద్యసంఘం. ఈ ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు నిలిచిపోయాయి. బంద్‌కు ఐఎంఏ తెలుగు రాష్ట్రాల కమిటీలు మద్దతు తెలిపాయి. జూనియర్ వైద్యులు సైతం మద్దతు తెలిపారు.
వైద్యసేవల నిలిపివేతతో రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ప్రత్నామ్నాయ ఏర్పాటు చేశాయి. ప్రభుత్వ వైద్యులందరూ ఇవాళ విధులకు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశించాయి. పీజీ వైద్య విద్యార్థులు విధుల్లో లేని లోటు కనిపించకుండా 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకొచ్చే రోగులకు చికిత్స లభించక ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com