Top

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు
X

పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగను వెనక్కి వెళ్లాలంటూ వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై ఘాటుగా స్పందించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పాదయాత్రలో పోలవరానికి పునాదులే పడలేదని ఎగతాళి చేశారని.. కానీ ఈ రోజు స్పిల్‌వేలో ఉండే రివర్స్‌ స్లుయీజ్‌ గేట్ల ద్వారా 2 లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించారని ట్వీట్‌ చేశారు చంద్రబాబు. అవహేళనలను, ఆరోపణలని ఎదుర్కొంటూనే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. ఇంత చేసిన మిగిలిన 30 శాతం పూర్తి చేయకపోతే పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందన్నారు చంద్రబాబు. వరద సమయంలో ప్రాజెక్టు కోసం పని చేస్తున్న కంపెనీలకు వెనక్కు వెళ్లిపోవాలి అంటూ నోటీసులు ఇచ్చారని.. దీన్ని బట్టే ప్రాజెక్టు నిర్మాణం పట్ల మీకు ఉన్న చిత్తశుద్ధి, దూరదృష్టి ఏపాటిదో అర్థం అవుతోందన్నారు టీడీపీ అధినేత.

Next Story

RELATED STORIES