తాజా వార్తలు

పాము.. పుంజూ పోరాటం.. గెలిచిందెవరో..

పాము.. పుంజూ పోరాటం.. గెలిచిందెవరో..
X

మట్టిలో దొరికే చిన్న చిన్న పురుగులు, గింజలను ఆహారంగా తీసుకుంటాయి కోళ్లు. పాముని చూస్తే మనుషులతో పాటు జంతువులు కూడా ఆమడ దూరం పరిగెడతాయి. అలాంటిది ఓ పుంజు మాత్రం.. మా అడ్డాకి ఎందుకు వచ్చావ్.. ఏం భయపడతామనుకున్నావా.. రా చూస్కుందాం అని పిలిచినట్టే దానితో ఫైటింగ్‌కి దిగింది. మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్‌పల్లిలో జరిగిన వింత దృశ్యాన్ని వీడియోల్లో బంధించారు స్థానికులు. పడగవిప్పిన నాగుపాముని చూసి కోళ్లు వెంటపడ్డాయి. పాము వాటిని కాటేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా సాధ్యం కాకపోవడంతో తోక ముడుచుకుని వచ్చిన దారినే వెళ్దాం కదా అనుకుంటే ఓ పుంజు మాత్రం నిన్ను వదిలిపెట్టేది లేదు.. మళ్లీ వచ్చి మాలో ఎవరినైనా కాటేస్తే అని అనుకుందో ఏమో.. పుంజు ముక్కుతో పాము పడగని పట్టుకుంది. దాన్నుంచి తప్పించుకుంటూనే నేలకేసి కొడుతూ పాముని చంపే ప్రయత్నం చేసింది. మిగతా కోళ్లు పుంజు నుంచి పాముని వేరు చేసేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అలా పోరాడి పోరాడి చివరకు మెలికలు తిరుగుతున్న పాముని ఒక్క ఉదుటున మింగేసింది పుంజు. స్థానికులు చూస్తూ ఉండి పోయారు తప్ప ఏమీ చేయలేకపోయారు. అయితే పాముని మింగిన పుంజు పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు స్థానికులు.

Next Story

RELATED STORIES