నేడు ఏపీ గవర్నర్ పర్యటన వివరాలు

ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విశాఖలో పర్యటిస్తున్నారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయన తొలి అధికారిక పర్యటన ఇదే. రెండు రోజుల పర్యటన నిమిత్తం బుధవారం ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి విశాఖకు చేరుకున్నారు. రెండురోజుల పర్యటన కోసం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఘన స్వాగతం లభించింది
అనంతరం ఈస్ట్రన్ నావల్ హెడ్ క్వార్టర్స్‌ను సందర్శించారు గవర్నర్. ఐఎన్ఎస్ డేగకు చేరుకొని యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు బయట నుంచే సందర్శించి అక్కడ నేవీ అధికారులతో చర్చించారు. సాయంత్రం కైలాసగిరి తెలుగు మ్యూజియం, వైఎస్సార్ సిటీ సెంట్రల్ పార్కును సందర్శించారు.
గవర్నర్ తన రెండో రోజు పర్యటనలో భాగంగా..గురువారం ఏయూలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నాం విశాఖ పోర్టు ట్రస్టులో జరిగే కార్గో, షిప్పింగ్ కార్యకలాపాలను ఆయన పరిశీలిస్తారు. రాత్రికి విజయవాడకు తిరుగు పయనమవుతారు గవర్నర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com