40 ఏళ్ల తర్వాత తీరిన కోరిక

40 ఏళ్ల తర్వాత తీరిన కోరిక
X

తన కుటుంబసభ్యులతో చాఫర్‌లో ప్రయాణించాలనే కోరికను 40 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నాడు ఓ క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగి. అది కూడా రిటైర్మెంట్‌ అయ్యాకే.. ఈ ఘటన హర్యానాలో జరిగింది. కురే రామ్‌ అనే వ్యక్తి నీమ్కా అనే ఊళ్లోని స్కూల్లో క్లాస్‌ ఫోర్‌ ఉద్యోగి. అది తన ఊరు సద్పురాకు 2 కిమీ దూరంలో ఉంది. ఉద్యోగరిత్యా తన ఊరి నుంచి రోజూ స్కూల్‌కు వెళ్లొచ్చేవాడు. ఇలా 40 ఏళ్లు పనిచేసిన రామ్‌ ఇటీవలే రిటైర్‌ అయ్యాడు. ఈ సందర్భంగా.. కుటుంబ సభ్యులతో కలిసి చాపర్‌లో ప్రయాణించాలనే కోరికను నెరవేర్చుకున్నాడు రామ్‌.

తన కోరికను ముందుగా తమ్ముడికు చెప్పాడు. దీంతో అన్నయ్య కోరికను తీర్చేందుకు సిద్ధమయ్యాడు సోదరుడు. ఇందుకోసం కుటుంబంతా 3లక్షల30 వేలు జమ చేసింది. డబ్బుతో.. రామ్‌ పనిచేసిన పాఠశాల నుంచి సద్పురాకు 8 ట్రిప్పులు తిరిగేలా ఓ చాపర్‌ను బుక్‌ చేశారు. రామ్‌ రిటైర్మెంట్‌ అనంతరం.. అతని కుటుంబ సభ్యులంతా నీమ్కా నుంచి సద్పురాకు చాపర్‌లో చేరుకున్నారు. సదుర్పాకు చాపర్‌లో వచ్చిన రామ్‌కు గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలికారు.

Next Story

RELATED STORIES