అభయారణ్యాల్లో పులులను ఎలా లెక్కిస్తారంటే..

అభయారణ్యాల్లో పులులను ఎలా లెక్కిస్తారంటే..

నల్లమల అటవీ ప్రాంతం వన్యప్రాణులకు ఆలవాలం. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో విస్తరించిన అటవీ ప్రాంతంలో పెద్దపులుల సంచారం అధికంగా ఉంటుంది. గతంలో జరిపిన అధికారిక లెక్కప్రకారం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వు ఫారెస్టులో 70 నుంచి 80 పులుల వరకు ఉన్నట్లు అటవీశాఖ అంచనా వేసింది. అయితే పొరుగు రాష్ట్రాలకు చెందిన వేటగాళ్లు, స్మగ్లర్లు పెద్దఎత్తున పులులను హతమార్చారు. చర్మం, కాలిగోర్లకు బహిరంగ మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటంతో...అత్యాధునిక ఉచ్చులతో చంపేసేవాళ్లు. ఫలితంగా పులుల సంతతి పెరగడానికి బదులుగా తగ్గుతూ వచ్చింది.

అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నల్లమల రారాజుగా చెప్పుకుంటున్న పెద్ద పులులు అడవిలో ఉనికిని చాటుతున్నాయి. 2018 జనవరిలో దేశవ్యాప్తంగా పులుల సంఖ్యను లెక్కించారు. అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ఈ గణాంకాలను విడుదల చేశారు ప్రధాని మోదీ. ఈ లెక్కల్లో కర్నూలు డివిజన్ పరిధిలో పులుల సంతతి పెరిగి 48కి చేరినట్లు వెల్లడైంది...

2006 లెక్కల ప్రకారం తెలుగురాష్ట్రాల్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం పరిధిలో 95 పులులు ఉండేవి.2010లో వాటి సంఖ్య 72కు పడిపోయింది. 2014లో 68కి తగ్గింది. అంటే 8 ఏళ్ల వ్యవధిలో 27 పులులు అంతరించిపోయాయి. కానీ తాజాగా జరిపిన లెక్కల ప్రకారం ఉమ్మడి ఏపీ పరిధిలో 74 పులులు ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు లెక్కగట్టారు. ఇందులో ఒక్క ఏపీలోనే 48 టైగర్లు ఉండగా...తెలంగాణలో 26 ఉన్నట్లు తేల్చారు. 2014తో పోలిస్తే 6 టైగర్లు పెరిగాయి.

1972 నుంచి దేశవ్యాప్తంగా పెద్ద పులుల లెక్కింపు ప్రారంభమైంది. మొదట ఏటా ఐదేళ్లకోసారి లెక్కించేవారు. 2006 నుంచి టైగర్ రిజర్వు ఫారెస్టులు ఏర్పాటు కావడంతో నాలుగేళ్లకోసారి గణంకాలు విడుదల చేస్తున్నారు..ఈ ప్రక్రియను పగ్ మార్కు, కెమెరా, ప్రత్యక్ష వీక్షణం, బార్కింగ్, మల మూత్రాల విసర్జన సేకరణలతో చేసేవారు. 2014 నుంచి శాస్త్రీయ పద్ధతిలో అంటే స్పై పాయింట్ అనే ఆటోమేటిక్ డిజిటల్ కెమెరా సాయంతో లెక్కిస్తున్నారు...

మలమూత్రాలను సేకరించి వాటి డీఎన్‌ఏ ఆధారంగా సంఖ్యను నిర్దారిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story