కూకట్‌పల్లిలో చిరుత సంచారం.. పాఠశాల గదిలోకి దూరి..

కూకట్‌పల్లిలో చిరుత సంచారం.. పాఠశాల గదిలోకి దూరి..
X

క్రూర మృగాలు వనాలను వీడి జనారణ్యంలోకి రావడం ఎక్కువైపోయింది. హైదరాబాద్‌ శివార్లలో అప్పుడప్పుడు చిరుతలు కలకలం రేపేవి. ఇప్పుడు ఏకంగా నగరంలోనే చిరుత అడుగుపెట్టింది. రాత్రి కూకట్‌పల్లి ప్రగతి నగర్‌లోకి ప్రవేశించింది. గీతాంజలి పాఠశాల మొదటి అంతస్తులోని ఓ గదిలోకి దూరింది. చిరుత అరుపులతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అటు.. చిరుతను పట్టుకునేందుకు అటవీ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

అటు.. చిరుత అరుపులకు భయపడి స్కూల్‌ వాచ్‌మెన్‌ మొదటి అంతస్తులోనే ఉండిపోయాడు. వాస్తవానికి మొన్న సాయంత్రం నుంచి చిరుత ఆనవాళ్లు ప్రగతి నగర్‌లో కన్పిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.

Tags

Next Story