తాజా వార్తలు

చిరుత పులి కాదట.. జంగు పిల్లి!

చిరుత పులి కాదట.. జంగు పిల్లి!
X

హైదరాబాద్‌ ప్రగతి నగర్‌లో చిరుత తిరుగుతోందన్న ప్రచారం కలకలం సృష్టించింది. స్థానికంగా ఉన్న గీతాంజలి స్కూల్లోకి రాత్రి చిరుత వెళ్లిందన్న వార్తలతో.. ఫారెస్ట్‌ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. రాత్రంగా అక్కడే ఉండి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. ఉదయం స్కూల్‌ భవనం మొత్తాన్ని పరిశీలించారు. అయితే చిరుత ఉన్న ఆనవాళ్లేమి కనిపించలేదు. అయితే అది జంగు పిల్లి అయి ఉంటుందని భావిస్తున్నారు. గాండ్రింపులు విన్నామని చెప్పిన వాచ్‌మెన్‌తో పాటు మరొక స్కూల్‌ సిబ్బందిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కావాలనే వారు అలా చెప్పారా.. లేక నిజంగానే చిరుత వచ్చిందా అనే దానిపై ప్రశ్నించనున్నారు.

Next Story

RELATED STORIES