రావణుడే మొదటి ఫైలట్.. కావాలంటే ప్రూఫ్ చూపిస్తారట!

రావణుడే మొదటి ఫైలట్.. కావాలంటే ప్రూఫ్ చూపిస్తారట!
X

రావణుడు ఓ రాక్షసుడు అందుకే సీతమ్మను ఎత్తుకెళ్లాడు. అని మనం రావణుడిని విలన్‌గా చూపిస్తుంటే శ్రీలంక వాసులు మాత్రం ఆయన్ను రాజుగా కీర్తిస్తుంటారు. అంతేకాదు చరిత్రలో మొట్టమొదటి వైమానికుడు రావణాసురుడని అంటున్నారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం ధృఢపరిచింది. దాదాపు 5వేల ఏళ్ల క్రితమే రావణాసురుడు విమానంలో విహరించాడని అంటున్నారు శ్రీలంక వైమానిక అధికారులు. ఈ విషయం గురించి శ్రీలంక సివిల్ ఏవియేషన్ అథారిటీ వైస్ చైర్మన్ శశి దానతుంగే మాట్లాడుతూ.. పురాణాల ఆధారంగా రావణుడు విమానాన్ని నడిపాడని చెప్పడం లేదు.. పూర్తి స్థాయిలో పరిశోధనలు జరిగిన తరువాత ఆధారలతో సహా సాంకేతికంగా నిరూపిస్తామని చెబుతున్నారు. కటునాయకేలో ఉన్న బండారు నాయకే విమానాశ్రయంలో బుధవారం శ్రీలంక పౌర విమానయాన నిపుణులు, చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తల సమావేశం జరిగింది. దాదాపు 5వేల సంవత్సరాల క్రితమే రావణుడు శ్రీలంక నుంచి భారతదేశానికి వెళ్లి తిరిగి వచ్చాడని సమావేశం తేల్చింది. మరి రావాలంటే విమానమే కదా ఆధారం.. అందుకే రావణుడే మొదటి వైమానికుడు అంటూ తీర్మానించారు.

Next Story

RELATED STORIES