ఆగస్ట్ 1నుంచి అమల్లోకి వస్తున్న ఎస్‌బీఐ కొత్త రూల్స్..

ఆగస్ట్ 1నుంచి అమల్లోకి వస్తున్న ఎస్‌బీఐ కొత్త రూల్స్..

వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలందిస్తున్న దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త నిబంధనలు ఆగస్ట్ 1నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఖాతాదారులకు కొంత నష్టం మరికొంత లాభం ఉండబోతోంది. మరి ఆ కొత్త రూల్స్ ఏంటో ఓసారి చూసేద్దాం..

ఎస్‌బీఐ తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం ఆగస్ట్ 1నుంచే అమలులోకి వచ్చింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు బ్యాంక్ ఆన్‌లైన్ మనీ ట్రాన్స్‌ఫర్ చార్జీలు తీసివేసి ఉచితంగా అందిస్తోంది. ఇకపై ఈ సేవలు 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. బ్యాంక్ సెలవలు, ఆదివారాల్లోనూ ఐఎంపీఎస్ మార్గంలో ఇతరులకు బదిలీ చేయవచ్చు. అయితే కేవలం రూ.1,000ల వరకు మాత్రమే ఉచిత సేవలు వర్తిస్తాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లు తగ్గించింది. 20 నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లలో కోత విధించింది. సవరించిన వడ్డీ రేట్లు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story