దేవదాస్ కనకాల చివరిగా..

దేవదాస్ కనకాల చివరిగా..
X

నటుడు, దర్శకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. కనకాల మృతితో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సీనీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

1945 జులై 30న యానాంలో జన్మించారు దేవదాస్‌ కనకాల. 100కు పైగా సినిమాల్లో నటించిన దేవదాస్ కనకాల.. నట గురువుగా ఎందరో నటులకు శిక్షణ ఇచ్చారు. యాక్టింగ్ స్కూల్ ప్రిన్సిపాల్‌గా తెలుగు తెరకు ఎంతో మంది ప్రతిభావంతులను పరిచయం చేశారాయన. ప్రతిభావంతమైన నటుడిగా దేవదాస్ కనకాలకు పేరుంది. దేవదాస్ తనయుడు రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతుండగా.. ఆయన కోడలు సుమ యాంకర్‌గా ఉన్నారు.

ప్రతిభావంతుడైన నటుడిగా దేవదాస్‌ కనకాలకు పేరు ఉంది. అయితే దర్శకుడిగా మాత్రం పెద్దగా విజయం సాధించలేకపోయారు కనకాల. చలిచీమలు, నాగమల్లి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఓ సీత కథ. గోరింటాకు, మల్లీశ్వరీ, సిరిసిరి మువ్వ, మంచు పల్లకి, గ్యాంగ్ లీడర్‌, పెదబాబు, కింగ్‌, జోష్‌, భలే దంపతులు, మనసంతా నువ్వే, నీ స్నేహంతో పాటు పలు చిత్రాల్లో నటించారు. కనకాల నటించిన చివరి చిత్రం భరత్‌ అనే నేను.

Next Story

RELATED STORIES