సైనిక శిబిరంపై హౌతీ సంస్థ దాడి.. 30 మంది మృతి

సైనిక శిబిరంపై హౌతీ సంస్థ దాడి.. 30 మంది మృతి

యెమెన్ లో మిలటరీ పెరెడ్ రక్తసిక్తమైంది. సైనికుల శిబిరంపై హౌతీ సంస్థ దాడికి పాల్పడింది. ఈ దాడిలో దాదాపు 30మంది మరణించారు. పలువురు గాయపడ్డారు. మిలటరీ పెరెడ్ పై హౌతీ మద్దతు దారులు కారుబాంబుతో ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. అయితే ఈ దాడి ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న హౌతీ పాల్పడిందని సౌదీ అరేబియా ఆరోపించింది. యెమెన్ ప్రధానమంత్రి మెయిన్ అబ్దుల్ మాలిక్ సయీద్ సైతం ఇదే అంశాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. మిలటరీ పెరెడ్ తోపాటు పోలీస్టేషన్ పై దాడికి పాల్పడిందని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రధానికి సౌదీ అరేబియా మద్దతు తెలుపుతుండగా... ఏర్పాటువాదులకు ఇరాన్ మద్దతుగా నిలుస్తోంది. దీంతో గత కొంతకాలంగా ఇరువర్గాలు దాడులకు దిగుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story