గుడ్‌న్యూస్.. గ్యాస్ ధర తగ్గింది

X
TV5 Telugu2 Aug 2019 6:20 AM GMT
సబ్సిడీయేతర గ్యాస్ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.62.50 మేర తగ్గింది. ఈ ధరలు గురువారం (ఆగస్ట్1) నుంచి అమల్లోకి వచ్చాయి. జులై నెలలో సబ్సిడీయేతర సిలిండర్ ధర రూ.100.50 తగ్గింది. ఆగస్ట్ 1 నుంచి 14.2 కేజీల బరువు ఉండే సిలిండర్ ధర ఢిల్లీలో రూ.62.50 తగ్గగా, ముంబై, చెన్నైలలో అది రూ.62గా ఉంది. గత రెండు నెలల్లో మొత్తం ధరలో రూ.163 వరకు తగ్గుదల కనిపించినట్లు ఐఓసీ పేర్కొంది. ఎల్‌పీజీ ధరలను ఇకపై ప్రతినెలా సమీక్షించనున్నారు. అంతర్జాతీయంగా ధరల తగ్గుదల ప్రభావం వల్ల సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Next Story