కియ పరిశ్రమ జనరల్ మేనేజర్‌కు వైసీపీ నాయకుల బెదిరింపులు

కియ పరిశ్రమ జనరల్ మేనేజర్‌కు వైసీపీ నాయకుల బెదిరింపులు

కియా కార్ల పరిశ్రమ ఉద్యోగులపై బెదిరింపులకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని అనంతపురం జిల్లా ఎస్పీ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సీకేపల్లి గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు రామచంద్రారెడ్డి కియా ప్లాంట్ జనరల్ మేనేజర్ సదాశివానికి ఫోన్ చేసి బెదిరించారు. తాము చెప్పినవాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలి.. తమ పార్టీకి చెందిన నాయకుల వాహనాలనే అద్దెకు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చాడు. వైసీపీ నేత తీరును కంపెనీ సీరియస్ గా తీసుకుంది. స్థానిక నేతలు బెదిరింపులు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. విచారించి బెదిరించినవారిని అరెస్టు చేయాలని ఎస్పీ ధర్మవరం డిఎస్పీని ఆదేశించారు. దీంతో వైసీపీ నేత రామచంద్రారెడ్డితో పాటు ముత్యాలరెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కౌన్సిలింగ్ ఇచ్చా వదిలేశారు.

భవిష్యత్తులో మళ్లీ బెదిరింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని వారిని మందలించి పంపించారు. భారీ ఎత్తున పెట్టుబడులతో వచ్చి.. స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న కంపెనీపై బెదిరింపులకు పాల్పడితే సహించేది లేదని డిఎస్పీ రమాకాంత్ హెచ్చరించారు. ప్రతిష్మాత్మక కియా పరిశ్రమ విషయంలో ఎలాంటి తప్పిదం జరిగినా జాతీయస్థాయిలో ప్రతిష్ట మసకబారుతుందని పోలీసులు గుర్తు చేస్తున్నారు. ఈవిషయంలో ఎవరు హద్దులు మీరినా సహించేది లేదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story