కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు

కోదండరాంను అదుపులోకి తీసుకున్న పోలీసులు
X

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో కోదండరాంను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. నల్లమల యురేనియం సమస్యలపై ప్రజలతో చర్చించడానికి కోదండరాం వెళ్తున్న సమయంలో.. హజీపూర్‌ చౌరస్తా దగ్గర ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు.

కోదండరాం అరెస్టుకు నిరసనగా శ్రీశైలం హైదరాబాద్‌ హైవే ప్రధాన రహదారిపై యురేనియం వ్యతిరేక పోరాట సమితి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తరోకోలో అమ్రాబాద్‌ మండలాల ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు.. ప్రజా సమస్యలపై చర్చించేందుకు వచ్చిన తనను అరెస్ట్‌ చేయడంపై కోదండరాం మండిపడ్డారు.

Tags

Next Story