Top

అర్హులకు పెన్షన్‌ రావాలంటే ఆ హుండిలో రూ.50 వేయాలి - లోకేష్

అర్హులకు పెన్షన్‌ రావాలంటే ఆ హుండిలో రూ.50 వేయాలి - లోకేష్
X

సమయానికి పెన్షన్లు ఇవ్వకుండా అవ్వాతాతల ఉసురుపోసుకుంటున్నారని సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. రాష్ట్రంలో పెన్షన్లు అందుతున్న తీరుపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. గతంలో ప్రతి నెలా ఒకటో తేదీన అందే పెన్షన్లు.. జగన్‌ సీఎం అయ్యాక సరిగ్గా అందడం లేదన్నారు.

గత నెలలో వారం దాటక పెన్షన్లు ఇచ్చారని.. ఈ నెల సగమే ఇచ్చారని విమర్శించారు. పించన్లు వెయ్యి పెంచుతామని హామీ ఇచ్చి.. తరువాత 250 మాత్రమే పెంచి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. అర్హులకు పెన్షన్‌ రావాలంటే వైసీపీ నాయకులు పెట్టిన హుండిలో 50 రూపాయలు వేయాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES