నాన్న గురించి రాజీవ్..

నాన్న గురించి రాజీవ్..
X

చిన్నప్పుడు అన్నా చెల్లెళ్లందరూ ఇలానే ఉంటారేమో. నేనూ చెల్లి తెగ అల్లరి చేసేవాళ్లం. చెల్లి ఎవరికీ తెలియకుండా ఏదో ఒకటి అంటూ ఉండేది నన్ను. దాంతో నాకు బాగా కోపం వచ్చేది. ఒక్కటిచ్చుకునేవాణ్ణి. వెంటనే నాన్న బెల్టు తీసేవారు. నేను తప్పించుకునేందుకు గదిలోకి వెళ్తే వెనకే వచ్చి తలుపు వేసేవారు. నా పని అయిపోయింది ఇవాళ ఆయన చేతిలో ఎన్ని దెబ్బలు తినాలో అని అనుకునేవాణ్ణి. కానీ నాన్న బెల్డు పక్కన పడేసి నన్ను దగ్గరకి తీసుకుని చెల్లి నీ కంటే చిన్నది కదా.. కొట్ట కూడదు అని మృదువుగా చెప్పేవారు.

పిల్లల గురించి తండ్రి దేవదాస్ కూడా ఒక సందర్భంలో.. పిల్లల పట్ల తల్లిదండ్రులకు ఎన్నో ఆశలు ఉంటాయి. మా పిల్లల పట్ల కూడా మాకు అలానే కొన్ని ఆశలు ఉండేవి. అమ్మాయి శ్రీలక్షి శ్రద్ధగా చదువుకునేది. ఎం.ఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసింది. ఈ క్రమంలోనే నటన గురించి చెబుతూ.. నటనా రంగంలో రాణించడానికి ఎంతో మంది నిద్రాహారాలు మాని కష్టపడుతుంటారని.. కళామతల్లి సేవలో తరించే అవకాశం అందరికీ రాదని చెప్పేవాడిని. అయినా నా మాటలు చెవిన పెట్టేది కాదు. అయితే సుమ ఇంటికి కోడలిగా రావడంతో ఆమెని చూసి, మా అమ్మాయి కూడా నటన పట్ల ఆసక్తి పెంచుకుందని చెప్పారు.

Next Story

RELATED STORIES