అంతర్జాతీయం

16 ఏళ్ల కుర్రాడు.. రూ.20.5 కోట్లు గెలిచాడు

16 ఏళ్ల కుర్రాడు.. రూ.20.5 కోట్లు గెలిచాడు
X

మా పిల్లలు గేమ్స్‌కు అలవాటయ్యారు. చదువుకోకుండా గాడ్జెట్స్‌తోనే టైంపాస్‌ చేస్తున్నారంటూ చాలామంది తల్లిదండ్రుల వద్ద ఉండే కంప్లైట్ ఇది. కానీ అలాంటి గేమ్‌ల వల్ల కోట్ల రూపాయలు సంపాందించాడు ఓ కుర్రాడు. ఈ గేమ్స్‌ ద్వారా లక్షల మంది అభిమానులతో పాటు సెలబ్రెటీ హోదాను కూడా తెచ్చి పెట్టింది. ఆ కుర్రాడే అమెరికాకు చెందిన కైల్‌ గీర్స్‌డార్ఫ్‌ అలియాస్‌ బుగా.

అమెరికాకు చెందిన 16 ఏళ్లు కుర్రాడు కైల్‌ గీర్స్‌డార్ఫ్‌ అక్షరాల రూ.20.5 కోట్ల ప్రైజ్‌మనీని గెలుచుకున్నాడు. నమ్మలేక పోతున్నారా! అయితే ఈ స్టోరీ చదవండి.. ఇటీవలే జరిగిన ‘ఫోర్ట్‌నైట్‌’ అనే ఆటలో కైల్‌ ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచి భారీ మెుత్తంలో క్యాష్ గెలుచుకున్నాడు. దీంతో ఆ కుర్రాడు రాత్రికి రాత్రే సెలబ్రెటీగా మారిపోయాడు. న్యూయార్క్‌లోని ఆర్థర్‌ ఆషె ఏరెనా స్టేడియంలో 23 వేల మంది ఆడియన్స్ మధ్య ఉత్కంఠభరితంగా జరిగిన ఈ టోర్నిలో కైల్‌ గీర్స్‌డార్ఫ్‌ విజేతగా నిలిచాడు. ఈ గెమ్‌లో ఆటగాళ్ళు స్టేడియంలోకి దిగి ఒకరికొకరు తలపడడం ఉండదు. స్టేడియంలో కంప్యూటర్‌ తెరల ముందు కూర్చుని హెడ్‌ఫోన్స్ పెట్టుకుని, రిమోట్ సహయంతో ఆడే మైండ్‌ గేమ్‌ ఇది. ఈ ‘ఫోర్ట్‌నైట్‌ ఎలిమే షన్ రౌండ్‌లో లక్షల మంది రేసులో పాల్గొంటే చివరికి 30 దేశాలకు చెందిన వందమందికి మాత్రమే ప్రపంచకప్‌లో పోటీ పడే అవకాశం వచ్చింది. అనంతరం జరిగిన మెగా టోర్నిలో సింగిల్స్‌, డబుల్స్‌ గీర్స్‌డార్ఫ్‌ విజేతగా నిలిచాడు. పైనల్లో 59 పాయింట్లతో తిరుగులేని ఆధిక్యం సాధించి టైటిల్‌ని గెలుచుకున్నాడు. టైటిల్‌ గెలిచాక వేలల్లో ఉన్న అతడి ట్విటర్‌ ఫాలోవర్ల సంఖ్య లక్షలకు చేరుకుంది. కైల్‌ గీర్స్‌డార్ఫ్‌ ‘ఫోర్ట్‌నైట్‌’ ప్రపంచ ఛాంపియన్‌ కావడం వల్ల ప్రైజ్‌మనీ మాత్రమే లాభం కాదు, అతడి కోసం స్పాన్సర్లు క్యూ కడుతున్నారు. వాణిజ్య ఒప్పందాల రూపంలో కోట్లు అందుకోబోతున్నాడు.

Next Story

RELATED STORIES