జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉంది : తులసిరెడ్డి

ఏపీ సీఎం జగన్‌పై... విరుచుకుపడ్డారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. పోలవరం పనులు ఆగిపోయే పరిస్థితి రావడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగతద్వేషంతోనే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు బీజేపీ ఎంపీ సుజనాచౌదరి. ప్రస్తుతం ఏపీలో ఏ పనులు కూడా ముందుకుసాగడం లేదన్నారాయన. ఒకసారి కంపెనీకి పనులు అప్పగించిన తర్వాత ప్రభుత్వాలు మారితే అవి కూడా మారాలనుకోవడం మంచిది కాదన్నారు..
అటు....బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి సైతం జగన్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రజలను మభ్య పెట్టే పనని మానుకోవాలని హితవు పలికారు. హోదా విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించడం సరైంది కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన పురంధేశ్వరి.. తరువాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు..
ప్రజల జీవనాడైన పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్ట్ పూర్తికాకుండా జగన్ ఓ శకునిలా మారాడని మండిపడ్డారాయన. జగన్ పాలన తుగ్లక్ పాలనలా ఉందంటున్నారు తులసిరెడ్డి.. మొత్తానికి... పోలవరం విషయంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు. సీఎం జగన్‌పై విమర్శలతో ఏపీ రాజకీయాల్ని మరింత హాట్‌హాట్‌గా మార్చాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com