బీజేపీలో చేరనున్న విజయశాంతి?

బీజేపీలో చేరనున్న విజయశాంతి?

ఆషాడం ముగిసింది. శ్రావణం వచ్చేసింది. వస్తూ వస్తూ వలసల సీజన్ కు రిస్టార్ట్ చేసింది. ఇన్నాళ్లు ఆషాడం సెంటిమెంట్ తో వలసలకు బ్రేక్ చెప్పిన బీజేపీ..శ్రావణంలో మాత్రం తెలంగాణ కాంగ్రెస్ లో సునామీ సృష్టించేందుకు అంతా రెడీ చేసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంతమంది బలమైన నేతలను పార్టీలో చేర్చుకున్న కాషాయ దళం.. తమ ఐడియాలజీతో సరిపోయే కాంగ్రెస్ అసంతృఫ్తులను పార్టీలో చేర్చుకునేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ విజయశాంతి బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.

తెలంగాణ రాష్టం కోసం సొంతంగా తల్లి తెలంగాణ పార్టీనీ స్థాపించి ఉద్యమాలు చేప్పట్టిన విజయశాంతి.. ఆ తర్వాత పార్టీని టీఆరెస్ లో విలీనం చేశారు. కానీ, కొద్దీ రోజులకే కేసీఆర్ కు ఆమెకు విభేదాలు వచ్చాయి. దీంతో విజయశాంతి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి కేసీఆర్ అన్నా, టీఆరెస్ పార్టీ అన్నా ఫైర్ బ్రాండ్ లో మారిపోతుంది విజయశాంతి. అయితే.. 2014 ఎలెక్షన్స్ లో మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆమె ఆ తర్వాత నుంచి ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ ఎన్నికల ప్రచారంలో మాత్రమే పాల్గొన్నారు. అయితే కాంగ్రెస్ లో నెలకొన్న అంతర్గత పరిస్థితులతో తన పోరాటానికి సరైన చోటు కాదనే ఆలోచనలో ఉన్నారు విజయశాంతి. ఇక గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కంటే ఒక ఎంపీ సీట్ గెలవడం... సీఎల్పీ టీఆరెస్ లో విలీనం కావడంతో కేసీఆర్ పైన పోరాటం చేసేందుకు బీజేపీ సరైన వేదికగా విజయశాంతి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించటం. బీజేపీ గ్రాఫ్ పెరుగుతుండటం.. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేందుకు అనుకూల రాజకీయాలు ఉండటం కూడా బీజేపీలోకి రాములమ్మ రీఎంట్రీకి లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల16 తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ టూర్ లొనే అమిత్ షా విజయశాంతికి కమలం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేదిశగా అడుగులు వేస్తూ పార్టీ కి కలిసొచ్చే వారికి స్వాగతం పలుకుతూనే ఉంది.

Tags

Read MoreRead Less
Next Story