తాజా వార్తలు

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం
X

మహబూబ్ ‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా ముగ్గురు చనిపోయారు.

మరోవైపు.. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందించినా.. 108 వాహనం ఆలస్యంగా వచ్చిందని స్థానికులు ఆగ్రహానికి గురయ్యారు. 108 వాహనంపై దాడి చేశారు. ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. అటు.. గాయపడ్డవారికి ఆస్పత్రిలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

Next Story

RELATED STORIES