పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని

పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని
X

పార్టీ ఫిరాయింపుల అంశంపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదని అన్నారు. వెంకయ్య స్థానంలో తానుంటే ఆ పని చేసేవాడిని కాదన్నారు. రాజ్యసభలో బీజేపీలో టీడీఎల్పీ విలీనంపై తమ్మినేని ఇలా వ్యాఖ్యానించారు. సభలో వ్యవహరించిన తీరుతోనే బయట గౌరవం లభిస్తుందని తాను నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. విజయవాడలో మీట్‌ ది ప్రెస్‌లో పాల్గొన్న తమ్మినేని.. అన్ని అంశాలపై సూటిగా సమాధానం ఇచ్చారు.

Tags

Next Story