కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

కేంద్ర  నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రానుందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు కశ్మీర్ లోయలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టానున్నారు.

జమ్ముకశ్మీర్‌లో క్షణక్షణం పరిస్థితులు మారుతున్నాయి. ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కశ్మీర్‌పై భారత ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోనుందనే ఊహాగానాల మధ్య వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ప్రజల్లో మరింత కలవరాన్ని రేపుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన జమ్మూకశ్మీర్ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇవాళ రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఆదివారం అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలో అత్యున్నత స్ధాయి సమావేశం నిర్వహించారు. గత ఫిబ్రవరిలో పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడి వంటి వాటికి తాజాగా మళ్లీ కశ్మీర్ లోయలో పాల్పడవచ్చునని ఇంటలిజెన్స్ నిఘా వర్గాలు హెచ్చరించడంతో అమిత్ షా వీరితో భేటీ అయ్యారు. అమర్‌నాథ్ యాత్ర రద్దు, కశ్మీర్‌లో బలగాల మోహరింపు తదితర పరిణామాల నేపథ్యంలో అత్యున్నత స్ధాయి సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు త్వరలో కశ్మీర్‌ లోయను అమిత్ షా సందర్శించనున్నారని వార్తలు వస్తున్న వేళ.. అటు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ప్రకటనలు పరిస్థితిని మరింత ఆందోళన కరంగా మారుస్తున్నాయి. రానున్న మూడు రోజులు అత్యంత కీలకమని.. గవర్నర్ చేసిన ప్రకటనతో పాటు.. సాక్షాత్తు మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్ధుల్లా రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిపై కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, 35ఏ రద్దుపై పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టనున్నారనే వదంతులు వంటి వరుస పరిణామాల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు సంబంధించిన ఓ కీలక బిల్లును అమిత్‌షా సోమవారంనాడు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.

అటు కేంద్ర మంత్రివర్గం ఇవాళ సమావేశం కానుంది. కేంద్ర మంత్రి వర్గం బుధవారం సమావేశం కావాల్సి ఉన్నప్పటికీ దానిని రెండు రోజుల ముందే సమావేశమౌతుంది. ఈనేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా చర్చనీయాంశం అయింది... జమ్మూకశ్మీర్‌ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

అకస్మాత్తుగా అమర్నాథ్ యాత్ర రద్దు చేశారు.యాత్రికులు అందరిని యాత్రను రద్దు చేసుకొని తిరిగి వాళ్ల ఇళ్లకు వెళ్ళిపోమని చెప్పారు..అసలు అందాల లోయలో ఏం జరుగబోతుంది అని సర్వత్రా ఉత్కంట వ్యాపించింది..మరో యుద్ధాన్ని తలపించేలా సైనిక బృందాలు జమ్మూకాశ్మీర్ కు తరలివెళ్లాయి. రమారమి 90 వేల మంది సైనిక బలగాలు జమ్మూ కాశ్మీర్ లో తిరుగుతున్నాయి .. అసలు జమ్మూ కాశ్మీర్ లో ఏం జరగబోతుంది .. నివురుగప్పిన నిప్పులా తయారయింది.. ఇప్పుడు కాశ్మిర్ లోయ పరిస్థితి .. తాజాగా కేంద్రం జమ్మూ కశ్మీర్‌పై ఎలాంటి ప్రకటన చేయనుందో అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది..

Tags

Read MoreRead Less
Next Story