పాకిస్థాన్‌పై కోపాన్ని కశ్మీరీలపై చూపిస్తున్నారు : ఆజాద్

జమ్మూ కశ్మీర్ విభజన నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిర్ణయాన్ని ఏమాత్రం అంచనా వేయని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మోదీ సర్కారు వైఖరిని విపక్షాలు రాజ్యసభలో ఎండగట్టాయి. ఎన్డీఏ నిర్ణయం జమ్మూకశ్మీర్‌లో సంక్షోభాన్ని సృష్టిస్తుందని కాంగ్రెస్ మండిపడింది. పాకిస్థాన్‌పై కోపాన్ని కశ్మీరీలపై చూపిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ గులాంనబీ ఆజాద్ ఘాటుగా విమర్శించారు. కశ్మీర్ విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎందుకింత ఆతృత పడుతోందని సూటిగా ప్రశ్నించారు. యాత్రికులు, విద్యార్థులను హఠాత్తుగా పంపించి, హడవుడిగా నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని నిలదీశారు.

అటు, కశ్మీర్‌కు చెందిన పీడీపీ, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. పీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో చొక్కాలు చించుకుని నిరసన తెలిపారు. డీఎంకే, ఎండీఎంకేలు కూడా ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దును తీవ్రంగా వ్యతిరేకించాయి.

Next Story

RELATED STORIES