జమ్ము కశ్మీర్‌‌ను విభజించిన కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌

జమ్ము కశ్మీర్‌‌ను విభజించిన కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌
X

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో పలు కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌ను విభజించగా అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్ము,కశ్మీర్‌లను విభజించారు. ఈ నిర్ణయంతో కశ్మర్‌ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది. రాజ్యాంగంలోని అధికరణ 370 రద్దుతో ప్రత్యేక ప్రతిపత్తి ఇక కశ్మీర్‌కు ఉండదు

Tags

Next Story