చిరు న్యూలుక్.. మరో కొత్త ప్రాజెక్ట్ కోసమా..!!

అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సైరాలో నరసింహారెడ్డి పాత్ర కోసం వేషం మార్చిన చిరంజీవి మరి ఈ కొత్త లుక్ మరో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేయట్లేదుకదా. అభిమానుల్లో ఇదే విషయంపై ఆసక్తి నెలకొంది. అయితే అసలు విషయం ఏంటంటే.. కోడలు ఉపాసన బీ పాజిటివ్ అనే హెల్త్ మ్యాగజైన్ నడుపుతోంది. అందులో మామ చిరంజీవిని ఇంటర్వ్యూ చేసి ఆయన చెప్పిన ఆరోగ్య సూత్రాలను అందులో పొందు పరిచింది. ఇక కవర్ పేజీ కోసం ఓ కొత్తలుక్ ట్రై చేసింది. చిరంజీవి సరికొత్తగా కనిపిస్తున్నారంటూ సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారు ఫోటోని చూసిన అభిమానులు. సైరా తరువాత చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల కథనం. ఇందులో డబుల్ రోల్‌తో ఆయన అభిమానులను అలరించనున్నారట. ఈ పాత్రల కోసం చిరు 10 కిలోల బరువు కూడా తగ్గారు. ఇందుకోసం కేరళ వెళ్లి మరీ ప్రత్యేక చికిత్స తీసుకున్నారట.
Also Watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com