ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..

గోదావరి ఉదృతి కొనసాగుతోంది. దీంతో తూర్పు గోదావరి జిల్లాలోని 4 మండలాలలో ముంపు గ్రామాల ప్రజలు క్షణమోక యుగంలా గడుపుతున్నారు. ఎటు చూసినా నీరే తప్ప.. ఊరు కనిపించని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా దేవీపట్నం మండలంలోని 32 గ్రామాలు ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. చేపలపేట, తొయ్యేరు, మంటూరు, కొండ మొదలు, పూడిపల్లి, కచ్చులూరు, గొందూరు, దండంగి, వీరవలంక, మడిపల్లి, సీతారం, మూలపాడు నీట మునిగాయి.

ఏడు రోజులుగా గోదావరి వరద నీటిలోనే గ్రామాల ప్రజలు మగ్గుతున్నాయి. ఇళ్ల పైకప్పు వరకు నీరు చేరడంతో పాటు సామాగ్రి సైతం కొట్టుకుపోయాయి. కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి నెలకొంది. బోట్లపై ప్రయాణం చేస్తూ బతుకు జీవుడా అని జీవనం గడుపుతున్నారు.

వరద తీవ్రతలో బిక్కుబిక్కుమంటున్న జనం ఇళ్లపైనే తలదాచుకుంటున్నారు. నిత్యావసర సరుకులు సైతం అందుబాటులో లేకపోవడంతో తల్లడిల్లి పోతున్నారు. తమ గోడు అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ముంపు గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. దేవిపట్నంలో పరిస్థితి దయనీయంగా ఉంది. ఇళ్లను వదిలి వెళ్తున్నారు. మరికొందరు కొండ ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. వరద ముంపు ఉందని గత మూడు నెలలుగా అధికారులకు మొరపెట్టుకున్నా తమ గోడు పట్టించుకోలేదని స్థానికులు వెల్లబుచ్చుకుంటున్నారు. తినడానికి తిండి కూడా అధికారులు అందించడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story