ఇక్కడ అందర్నీ వదిలేసి ముంబయికి..

ఇక్కడ అందర్నీ వదిలేసి ముంబయికి..

టాలీవుడ్‌ క్రేజీస్టార్ విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని భాషల్లో తన పేరు మారు మ్రోగేలా చేసుకున్నాడు. తాజా చిత్రం డియర్ కామ్రెడ్‌ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి పాపులర్ డైరక్టర్ కరణ్ జోహార్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ కూడా తీసేసుకున్నారు ఆయన. అందుకు విజయ్‌కి రూ.40 కోట్లు ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే వి జయ్ ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విజయ్ స్పందించాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా అర్జున్ రెడ్డి హిందీలో కూడా విజయ్‌నే నటించమని అడిగారట నిర్మాతలు. దానికి విజయ్ ఒకసారి నటించిన పాత్రలో మరోసారి నటించనని చెప్పాడట. ఇదే విషయంపై విజయ్ మాట్లాడుతూ.. నాకూ బాలీవుడ్ సినిమాల్లో నటించడం ఇష్టమే. అయితే ఆ చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి రావాలనుకుంటున్నాను.. ఆ విధంగా ప్లాన్ చేస్తున్నానని అన్నాడు. ఇంకా.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా ఇక్కడ ఉంటే సినిమా కోసం ముంబయిలో ఓ అపార్ట్ మెంట్లో ఉండడం ఇష్టం లేదని అన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story