అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఫరూక్ అబ్దుల్లా

X
TV5 Telugu6 Aug 2019 1:06 PM GMT
కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా భద్రంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన ఇంట్లో స్వేచ్చగా ఉన్నారని తెలిపారు. ఫరూక్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూ క్ అబ్దుల్లా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను స్వేచ్చగా ఉన్నానన్న వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. తనను హౌస్ అరెస్టు చేశారని, ఇంట్లో నుంచి కదలనివ్వడం లేదని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని సర్వనా శనం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
Next Story