కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టిన జమ్మూకాశ్మీర్ విభజన

జమ్మూకాశ్మీర్ విభజన కాంగ్రెస్ లో చిచ్చు పెట్టింది. విభజన బిల్లును ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ తదితరులు వ్యతిరేకిస్తుండగా.. సీనియర్ నేత జ్యోతిరాదిత్య సింధియా మాత్రం సమర్థించారు. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్‌‌ పూర్తిగా భారత్‌లో విలీనం కావడాన్నిస్వాగతిస్తున్నట్టు ట్వీట్‌ చేశారు. అయితే కేంద్రం ఏకపక్షంగా కాకుండా రాజ్యాంగ పద్ధతి ప్రకారం విభజన చేస్తే, ఎవ్వరూ కూడా ప్రశ్నించే వారు కాదన్నారు జ్యోతిరాదిత్య. భారతదేశ ప్రయోజనాల దృష్ట్యా కాశ్మీర్ విభజన బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని వివరించారు.

Next Story

RELATED STORIES