Top

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో 3వ తరగతి బాలుడు..

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో 3వ తరగతి బాలుడు..
X

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలుడ్ని అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. హాస్టల్‌ బాత్‌రూమ్‌లోనే బాలుడ్ని గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. కుమారుడు దారుణహత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చిన్నారి దారుణ హత్యతో చల్లపల్లి గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి..

ఇదే హాస్టల్లో ఆదిత్య అన్నయ అశోక్ ఏడో తరగతి చదువుతున్నాడు. ఉదయం లేచిన తరువాత తమ్ముడు ఆదిత్య కనిపించడం లేదని అన్నయ్య అశోక్.. వాచ్ మెన్ నాగబాబుకు చెప్పాడు. దీంతో ఇద్దరు ఆదిత్యను వెతుకుతుండగా బాత్ రూమ్ దగ్గర ఆదిత్య రక్తపు మడుగులో ఉండడాన్ని గమనించి షాక్ కు గురయ్యారు. వెంటనే తేరుకుని వాచ్ మెన్ నాగబాబు.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏ కోణంలో హత్య జరిగిందన్ దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES