జమ్ముకశ్మీర్ పరిణామాలపై స్పందించిన రాహుల్‌

జమ్ముకశ్మీర్ పరిణామాలపై స్పందించిన రాహుల్‌

జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసే బిల్లు, ఆర్టికల్ 370 రద్దుపై AICC మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. జమ్ముక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేయడాన్ని త‌ప్పుప‌ట్టారాయన. జాతీయ భ‌ద్ర‌త‌కు ఇది పెను ప్ర‌మాదంగా మారుతుందని రాహుల్ అభిప్రాయపడ్డారు. జ‌మ్ముక‌శ్మీర్‌ను ఏకప‌క్షంగా విభ‌జించి జాతీయ స‌మ‌గ్ర‌త‌ను కాపాడ‌లేర‌న్నారు. ప్ర‌జాప్ర‌తినిధుల‌ను అరెస్టు చేసి, రాజ్యాంగాన్ని ఉల్లంఘించ‌డం స‌రికాద‌న్నారు. దేశం ప్ర‌జ‌ల‌తో నిర్మిత‌మై ఉంద‌ని, కేవ‌లం భూమి ముక్క‌లు కాద‌ంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story