సుష్మా స్వరాజ్ మృతి ...గుండెపోటుతో ఢిల్లీ ఎయిమ్స్ లో కన్నుమూత...

కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్య శాలలో కన్నుమూశారు. గత కొంత కాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాస్వరాజ్ ఆకస్మికంగా గుండెపోటు రావడంతో ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్ తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. దీంతో సర్వత్రా విషాదం అలుముకుంది. తీవ్ర అస్వస్థతతో కన్నుమూసిన సుష్మ స్వరాజ్ వయస్సు 67 సంవత్సరాలు. జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా ఆమె చివరి సారి ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమితషాకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. అయితే గత కొంత కాలంగా సుష్మా స్వరాజ్ అస్వస్థతతో బాధపడుతున్నారు. సుష్మా స్వరాజ్ హఠాన్మరణంతో బీజేపీ శ్రేణులన్నీ విషాదంలో మునిగిపోయాయి. బీజేపీ తొలితరం నేతల్లో ఒకరైన సుష్మా స్వరాజ్ 1953 ఫిబ్రవరి 13న హర్యానాలోని అంబాలాలో జన్మించారు.'
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com