వింత ఆచారం.. నాగుల పంచమి రోజున ఆ తేళ్ళు ఏమీ చేయవంటూ..

వింత ఆచారం.. నాగుల పంచమి రోజున ఆ తేళ్ళు ఏమీ చేయవంటూ..

నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని కర్ణాటక రాష్ట్రం కందుకూరు గ్రామంలో కొండపై వెలసిన కొండమ్మవ్వ దేవాలయం దగ్గర నాగుల పంచమిని పురస్కరించుకుని సోమవారం ఆ గ్రామ ప్రజలు తేళ్ల పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్న తరువాత పైన ఉన్న బండరాళ్లను లేపి కింద భాగంలో ఉన్న తేళ్లను తీసుకుని ముఖం, చేతులు, నాలుక శరీరంపై ఉంచుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాగుల పంచమి రోజు మాత్రమే ఈ తేళ్లు ఎలాంటి హామీ చేయవని ఆ గ్రామ ప్రజల విశ్వాసం. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాతో పాటు కర్ణాటక రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి తేళ్లను పట్టుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story