కేసులు తీసుకోకుంటే కోర్టుకు వెళతాం : చంద్రబాబునాయుడు

కేసులు తీసుకోకుంటే కోర్టుకు వెళతాం : చంద్రబాబునాయుడు

గుంటూరులో జరిగిన సమావేశంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలు ఎంత ఉత్సాహంగా ఉంటే పార్టీ అంత ఉత్సాహంగా ఉంటుందని చెప్పారు. కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే .. తిరిగి కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులు కేసులు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండించారు చంద్రబాబు. రాష్ట్రమంతా పులివెందుల పంచాయితీలు చేస్తామంటే కుదరదన్నారు..

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక రేట్లు తగ్గాయా? పెరిగాయా? అని నిలదీశారు చంద్రబాబు. తమ ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా అందిస్తే.. వేల కోట్లు దోచుకున్నారంటూ విషప్రచారం చేశారని మండిపడ్డారు. మరి ఇప్పుడు వైసీపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఇసుక పేరు చెప్పి వైసీపీ నాయకులు పది రెట్లు దోచేస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ప్రధానిని కలిస్తే రాష్ట్రానికినిధులు అడగాలి కానీ తనపై ఫిర్యాదులు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు.

ఇక ఎన్నికల్లో తెలుగుదేశం ఎందుకు ఓడిపోయిందో ఇప్పటికీ అర్థం కావడం లేదన్నారు .23 సీట్లు ఇచ్చే అంత తప్పు తానేమీ చేయలేదన్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఎన్నికలు చూడలేదన్నారు. తన కష్టాన్ని ప్రజలు గుర్తించలేకపోయారనే

బాధ ఉందని చెప్పారు.

అన్నక్యాంటీన్లకు వైసీపీ అన్యాయంగా మూసివేసిందని మండిపడ్డారు చంద్రబాబు. అసెంబ్లీలోనూ ప్రభుత్వం వ్యవహరించిన తీరుని తప్పుపట్టారు. ఘోరంగా అవమానించినా ప్రజల కోసం భరించామని అన్నారు. పోలవరాన్ని వదిలేసిన ప్రభుత్వం ఇప్పుడు గోదావరి నీళ్లను శ్రీశైలంలోకి తెస్తామంటోందని ఎద్దేవా చేశారు.

Tags

Read MoreRead Less
Next Story