మేడం.. 46 ఏళ్లుగా నేను మీ వెంట..

మేడం.. 46 ఏళ్లుగా నేను మీ వెంట..
X

భారత మాజీ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ హఠాన్మరణం యావత్ దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. దేశంలోని పౌరులంతా సుష్మ మృతికి నివాళులర్పిస్తున్నారు. ఆమెలోని డైనమిక్ లీడర్ లక్షణాలను వేనోళ్ల పొగుడుతున్నారు. కాగా, ఇన్నేళ్లు ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకున్న భర్త కౌశల్ స్వరాజ్ స్పందించిన తీరు వారిద్దరి మధ్య కొనసాగుతున్న హుందాతనమైన అన్యోన్యతను వ్యక్తపరుస్తుంది. ఆయన తన భార్యను ఎంత ప్రేమగా గౌరవించారో తెలుస్తోంది.

మేడం మీరు ఎన్నికలలో పోటీ చేయనని నిర్ణయం తీసుకున్నందుకు థాంక్స్. మిల్కాసింగ్ కూడా పరుగుపందేన్ని ఆపేశాడు. మీ రాజకీయ ప్రయాణం 1977 నుంచి మొదలై 41 సంవత్సరాల పాటు కొనసాగింది. 11 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్నారు. కేవలం రెండు సార్లు 1991, 2004లో మినహా ప్రతి ఎన్నికల్లో పోటీ చేస్తూనే ఉన్నారు. లోక్‌సభకు నాలుగు సార్లు, రాజ్యసభకు మూడు సార్లు ఎన్నికయ్యారు. 25 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుంచి పోటీ చేస్తూనే ఉన్నారు. 41 సంవత్సరాల మారథాన్‌ను చేరుకున్నారు. 46 ఏళ్లుగా నేను మీ వెనుకే పరుగెడుతున్నా. నేను 19 ఏళ్ల కుర్రాడిని కాదు. నా క్కూడా వయస్సైపోతోంది. థ్యాంక్యూ అని లెటర్ ద్వారా భార్యపై ఉన్న గౌరవాన్ని సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES