ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు.. సుష్మాస్వరాజ్‌ లైఫ్ హిస్టరీ

ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు.. సుష్మాస్వరాజ్‌  లైఫ్ హిస్టరీ
X

చిన్నమ్మ కన్నుమూశారు. రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్‌ మరణించారు. అనేక పదవులు చేపట్టి... తనదైన ముద్ర వేశారు కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌. అంచెలంచలుగా.. ఎదిగి బీజేపీ కీలక నేతగా మారారు. కమలం ఎప్పుడు గెలిచినా.. హైకమాండ్‌ ఆమెకు మంత్రి పదవినిచ్చింది. పార్టీకి వీర విధేయురాలిగా ఉన్న సుష్మా.... తనకు అప్పగించిన పనిని పూర్తి చేసి అందరి మన్ననలూ పొందారు.

బీజేపి తొలితరం నేతల్లో..... సుష్మా స్వరాజ్‌ ఒకరు. ఆమె 1953 ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలలో జన్మించారు. పంజాబ్‌ యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందిన సుష్మ ... . 1970లో విద్యార్ధి దశలోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఏబీవీపీ నాయకురాలిగా.... అప్పటికి ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు చేశారు. 1977లో చిన్నవయస్సులోనే తొలిసారిగా ఎమ్మెల్యేగా హర్యానా అసెంబ్లీలో కాలుపెట్టారు. అదే ఏడాది ఏర్పడిన దేవీలాల్‌ నేతృత్వంలోని జనతా ప్రభుత్వంలో..... కార్మిక ఉపాధి శాఖా మంత్రిగా పనిచేశారు.....

1980లో కార్మాల్‌ నియోజకవర్గం నుంచి తొలిసారి లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 1984లో బీజేపీలో చేరిన సుష్మ.....1984, 89లో కార్మాల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పొందారు. 1987లో రెండోసారి బీజేపీ తరపున హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.1987 నుంచి 1990 వరకు దేవీలాల్‌ నేతృత్వంలోని లోక్‌దళ్‌ - బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్య మంత్రిగా పనిచేశారు. అదే ఏడాది రాజ్యసభకు ఎన్నికై జాతీయ రాజకీయాల్లో ప్రవేశించారు. ఆ తర్వాత.. 1996లో దక్షిణ డిల్లీ నుంచి 11వ లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1993లో వాజ్‌పేయి ప్రభుత్వంలో సమాచార, ప్రసారశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో 12 వ లోక్‌సభలో రెండోసారి దక్షిణ డిల్లీ నుంచి గెలిచి.. వాజ్‌పేయి ప్రభుత్వంలో రెండో సారి అదే శాఖను చేపట్టారు.....

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో.. 1998 అక్టోబర్‌లో ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీకి మొదటి మహిళా ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బళ్లారిలో సోనియాపై పోటీ చేశారు. అయితే... కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న బళ్లారిలో సుష్మా ఓడిపోయారు. ఇక 2004లో ఉత్తరాఖండ్‌నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుష్మా స్వరాజ్‌ 2000 నుంచి 2003 వరకు ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు. 2006లో మరోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో మోడీ ప్రభత్వం తొలి క్యాబినెట్‌లో విదేశాంగ మంత్రిగా పనిచేశారు. ఈ పదవిలో తనదైన ముద్ర వేశారు సుష్మస్వరాజ్‌..

1975లో న్యాయవాది అయిన స్వరాజ్‌ కౌశల్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె ఉన్నారు. భర్త స్వరాజ్‌ కౌశల్‌ సుప్రీం కోర్టు లాయర్‌గా, మిజోరాం గవర్నర్‌గా పనిచేశారు. బరోడా బాంబు పేలుళ్ల కేసులో... జార్జ్‌ ఫెర్నాండేజ్‌ తరపున వాదించి గెలిపించారు. కర్ణాటకతోపాటు తెలుగురాష్ట్రాల్లోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రధానంగా... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో సుష్మా.. కృషి అనిర్వచనీయం. ఆమెను చిన్నమ్మగా తెలుగు రాష్ట్రాల ప్రజలు కీర్తిస్తున్నాయి. ఇటీవలే సుష్మాస్వరాజ్‌... మూత్ర పిండాల మార్పిడి చికిత్స చేయించుకున్నారు. దీంతో 2019లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఆమె పోటీకి దూరంగా ఉన్నారు. ఇంతలోనే ఆమె అందరికీ దూరమయ్యారు. చిన్నవయస్సులోనే ఎన్నో పదవులు అధిరోహించారు సుష్మా స్వరాజ్‌. ఏ పదవిలో ఉన్నా.. ఆ పదవికి వన్నె తెచ్చారు.....

Next Story

RELATED STORIES