ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతన పెంపుతో పాటు ప్రమోషన్ కూడా..

ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వేతన పెంపుతో పాటు ప్రమోషన్ కూడా..

కేంద్రీయ విద్యాలయ సంగథన్ (కేవీఎస్) ఉద్యోగులకు వేతనం పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆల్ ఇండియా ఆడిట్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ హరిశంకర్ తివారీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కేవీఎస్‌లో పనిచేసే అసిస్టెంట్ ఎడిటర్ల బేసిక్ వేతనంతో పాటు హెచ్‌ఆర్ఏ, డీఏ వంటివి కూడా పెరుగుతాయని తెలిపారు.కొన్ని విభాగాలకు మాత్రమే ఈ పెంపు వర్తిస్తుంది. ఉద్యోగులకు ఇంటి అద్దె అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్ పెంచుతున్నట్లు తెలిపింది. దీని ప్రకారం ఈ ఉద్యోగుల గ్రేడ్ పే స్కేల్‌ను రూ.4200 నుంచి రూ.4,600కు పెరిగింది. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 7కు ప్రమోషన్ లభించింది. దీంతో జీతం రూ.5,000 పెరుగుతుంది. వేతన పెంపు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులు దాదాపు మూడున్నర ఏళ్ల ఎరియర్స్ లభిస్తాయి. 7వ వేతన సంఘం ప్రకారం.. లెవెల్ 7 అధికారుల మినిమమ్ బేసిక్ శాలరీ రూ.44,900గా ఉంది. దీనికి 12 శాతం డీఏ, రూ.10,776 హెచ్‌ఆర్ఏ అదనం. అదే లెవెల్ 6 అధికారుల బేసిక్ పే రూ.35,400గా ఉంది. దీనికి 12 శాతం డీఏ, రూ.8,496 హెచ్ఆర్ఏ అదనం.

Tags

Read MoreRead Less
Next Story