తాజా వార్తలు

రూల్స్ పాటిస్తున్నారా.. అయితే మీకు సినిమా..

రూల్స్ పాటిస్తున్నారా.. అయితే మీకు సినిమా..
X

రూల్స్ పాటించండి బాబు.. మాకు సినిమా చూపించకండి.. కావాలంటే మీకే మేము సినిమా టికెట్లు ఫ్రీగా ఇస్తాం అంటున్నారు హైదరాబాద్ నగర పోలీసులు. హెల్మెట్ పెట్టుకోండి.. స్పీడుగా వెళ్లకండి.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయకండి.. సిగ్నల్స్ క్రాస్ చేయకండి.. లైసెన్స్ లేకుండా బండి నడపకండి.. ఎన్ని సార్లు చెప్పాలండి. నెత్తీ నోరు బాదుకుని పదే పదే చెబుతున్నా పెడచెవిన పెడతారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తప్పిదాలకు పోలీసుల్నే బాధ్యులు చేస్తారు. అందుకే ఈ సారి మళ్లీ ఓ ప్లాన్.. ఇదైనా పారుతుందేమో అని ఓ ట్రయల్. ట్రాఫిక్ నిబంధనలు పక్కాగా పాటిస్తే సినిమా టికెట్లు ఫ్రీ. పెండింగ్ చలాన్లు లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే వారికి, ట్రాఫిక్ రూల్స్ పాటించే వారికి సినిమా టికెట్లు ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తున్నారు. బుధవారం జుబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించి పలువురు వాహనదారులకు సినిమా టికెట్లు ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ప్రజల్లో ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన బాగా పెరిగిందని తెలిపారు. హెల్మెట్లు ధరించే వారి సంఖ్య 90శాతం పెరిగిందని అన్నారు. ఈ మార్పు హర్షించదగినదని ఆయన అన్నారు.

Next Story

RELATED STORIES