భక్తులకు కరెంట్‌ షాక్‌.. ఆలయంలో తొక్కిసలాట

భక్తులకు కరెంట్‌ షాక్‌.. ఆలయంలో తొక్కిసలాట
X

తమిళనాడులోని కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్య్కూట్‌ జరిగింది. వీఐపీ క్యూలైన్‌లో ఐరన్‌ బారికేడ్‌కు విద్యుత్‌ సరఫరా జరిగి.. భక్తులకు కరెంట్‌ షాక్‌ తగిలింది. విద్యుత్‌ ఘాతంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు. ప్రాణభయంతో పరుగులు తీయడంతో.. ఒక్కసారిగా ఆలయంలో అలజడి మొదలై తొక్కిసలాటకు దారి తీసింది. భక్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో 20మంది భక్తులకు గాయాలయ్యాయి. సిబ్బంది అప్రమత్తమై విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడ్డవారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. గతంలో కూడా ఇదే ఆలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగి ఐదుగురు చనిపోయారు.

Next Story

RELATED STORIES