జమ్మూకాశ్మీర్ విషయంలో మా వైఖరి అదే: అమెరికా

జమ్మూకాశ్మీర్ విషయంలో మా వైఖరి అదే: అమెరికా
X

జమ్మూకాశ్మీర్ అంశంపై తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. జమ్మూకాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే 370 ఆర్టికల్ రద్దుతర్వాత అమెరికా స్పందించింది. కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్- పాక్ ద్వైపాక్షిక అంశమని అమెరికా విదేశాంగ ప్రతినిధి మోర్గాన్ ఓర్టగస్ అన్నారు. బ్యాంకాక్ లో జరిగిన A.S.E.A.N సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎన్ జైశంకర్ తో ఆమె బేటీ అయి భారత్, పాకిస్తాన్ లగురించి సుదీర్ఘంగా చర్చించారు. ఆగ్నేయాసియాతో తమకు మంచి సంబంధాలున్నాయన్న మోర్గాన్ ..... భారత్, పాక్ లతో కలిసి తాము పనిచేయాల్సింటుందన్నారు.. ఈ పరిస్థితుల్లో ఇరుదేశాలు సంయమనం పాలించాలని సూచించారు.

Next Story

RELATED STORIES