విష్ణుకు విరోనిక స్ట్రాంగ్ కౌంటర్.. మీ ఇద్ద‌రినీ మామ‌ూలుగా కొట్ట‌నంటూ..

విష్ణుకు విరోనిక స్ట్రాంగ్ కౌంటర్.. మీ ఇద్ద‌రినీ మామ‌ూలుగా కొట్ట‌నంటూ..
X

హీరో విష్టు నాలుగోసారి తండ్రి అయ్యాడు. భార్య విరోనిక ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. త‌న భార్య విరోనిక డెలివ‌రీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లో పెడ‌తాన‌ని ప్రకటించాడు. ఈ స‌ల‌హా త‌న‌కి కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇచ్చింద‌ని ట్వీట్ లో తెలిపాడు విష్ణు. "కాజ‌ల్ ఐడియాతో నా భార్య డెలివరీని ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాలని అనుకుంటున్నాను త్వరలోనే విరోనికా మరో బిడ్డకు జన్మనివ్వబోతుంది. ధన్యవాదాలు. కాజల్.. నువ్వు ఇచ్చిన సలహా నాకు నచ్చింది" అంటూ ట్వీట్ చేశాడు.

భర్త ట్వీట్‌పై స్పందించిన విరోనిక విష్ణుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "మిమ్మ‌ల్ని ఇద్ద‌రినీ మామ‌ూలుగా కొట్ట‌ను. అయితే మీరు అనుకునే దాంట్లో ఎలాంటి నేరం లేదు కాజల్" అంటూ విరోనిక ట్వీట్ చేసింది. దీనికి విష్ణు స్పందిస్తూ కొందరి బెదిరింపుల కారణంగా ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ ఇవ్వాల‌నే ఆలోచ‌న విర‌మించుకున్నాను. ఆవిడకు మోహ‌న్ బాబు మద్దతు ఉండ‌డంతో నా నిర్ణ‌యాన్ని మార్చుకోక త‌ప్ప‌లేదు అని భార్యను ఉద్దేశించి స‌ర‌దా కామెంట్స్ చేశాడు విష్ణు.

విష్ణు, విరోనిక‌ 2009 మార్చిలో వివాహం చేసుకున్నారు. 2011లో ఈ దంప‌తుల‌కి అరియానా, వివియానా అనే కవల పిల్లలు పుట్టారు. 2018లో విష్ణు దంపతులు మ‌రో బిడ్డకు జ‌న్మనిచ్చారు. ఆ చిన్నారికి అవ్రామ్ భక్త అని పేరు పెట్టారు. . తాను నాలుగోసారి తండ్రి కాబోతున్నట్టు విష్ణు మేలో తెలిపాడు.తాజాగా విరోనిక‌తో క‌లిసి న్యూయార్క్‌లోని బ్లూక్లిన్ బ్రిడ్జ్‌పై దిగిన ఫోటోని ట్విట్టర్‌లో షేర్ చేశాడు ఓట‌ర్ సినిమాతో మంచు హీరో త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Next Story

RELATED STORIES