సూపర్ ఐడియా గురూ..

సూపర్ ఐడియా గురూ..
X

అందంగా ఉన్న ప్లాస్టిక్ బాటిల్ అనారోగ్యాలెన్నింటినో మోసుకు వస్తుంది. ప్లాస్టిక్ భూతం పర్యావరణాన్నీ పట్టి పీడిస్తుందని ప్రభుత్వాలు నెత్తీ నోరు మొత్తుకున్నా ప్లాస్టిక్‌తో మమేకమైన మానవ జీవితం.. అది లేనిదే రోజు గడవడం కష్టంగా మారింది. మరి ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసే ప్రకృతి ప్రేమికులకు చెక్కబాటిల్ చక్కని పరిష్కారాన్ని చూపిస్తుంది. ఓ ఐఐటీ విద్యార్థి ప్లాస్టిక్ బాటిల్ స్థానంలో చెక్క బాటిల్‌ను తయారు చేశాడు. అసోం ఐఐటీ యూనిర్శిటీ నుంచి పట్టభద్రుడైన ధ్రితిమాన్ బోరా వెదురు బొంగులతో రూపొందించిన ఈ బాటిల్ ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. ఇందులో నీళ్లు పోస్తే చల్లగా కూడా ఉంటాయంటున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ చెక్క బాటిల్ ధర ఒకటి రూ.450 నుంచి 700 వరకు ఉంది.

Next Story

RELATED STORIES