అనుమానంతో తల్లి గొంతు కోసిన కొడుకు

అనుమానంతో తల్లి గొంతు కోసిన కొడుకు
X

తల్లి వివాహేతర సంబంధం జీర్ణించుకోలేని ఓ కొడుకు.. తల్లిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడలో చోటు చేసుకుంది.

తన తల్లి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని అనుమానం పెంచుకున్న కుమారుడు ప్రేమ్‌ కుమార్‌.. పలు సార్లు తల్లిని మందలించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కొడుకు దౌర్జన్యాలను తట్టుకోలేని తల్లి జ్యోతి.. కుమారుడిపై గుడిపాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ప్రేమ్‌కుమార్‌ను మందలించి పంపారు. దీంతో తల్లిపై కోపంతో ఇంటిని వదిలి వెళ్లిపోయాడు. మళ్లీ కాసేపటికి తిరిగి వచ్చిన అతడు.. తల్లి వేరే వ్యక్తితో ఉండడాన్ని సహించలేక కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. అడ్డొచ్చిన సౌందర్‌రాజన్‌ అనే వ్యక్తిపై కూడా ప్రేమ్‌ కుమార్‌ దాడికి పాల్పడ్డాడు. అనంతరం పోలీసులు ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES