ప్రధాని మోదీకి రాహుల్ ఫోన్ కాల్

ప్రధాని మోదీకి రాహుల్ ఫోన్ కాల్
X

కేరళలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. ఇప్పటికే కేరళలో 14 జిల్లాలను వర్షాలు అతలాకుతలం చేశాయి. వయనాడ్, ఇడుక్కి, కన్నూర్, పాలక్కాడ్, కూర్గ్, మలప్పుళ, కోజికోడ్ జిల్లాలు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ఎడతెరిపిలేని వర్షాలు, పోటెత్తుతున్న వరదలతో 5 జిల్లాలు జలదిగ్బంధమయ్యాయి. ఇళ్లు కూలిపోయాయి. రోడ్లు ధ్వంసమయ్యా యి. చెట్లు, కరెంట్ స్తంభా లు విరిగిపడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కేరళలో మణిమాల, మీనాచల్, మూవత్తుపుళ, చలియార్, వలపట్టణం, పంబ నదులు ప్రమాదరకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పెరియార్ నది ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంతాలను ముంచేసింది. పెరియార్ నది ఒడ్డున ఉన్న ప్రముఖ శివాలయం నీట మునిగింది. మున్నార్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి రాకపోకలు ఆగిపోయాయి. ఇంట ర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులోకి భారీగా నీరు చేరడంతో విమానాశ్రయాన్ని మూసివేశారు.

వర్షాలు, వరదల దెబ్బకు కేరళలో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 2వందల మంది గాయపడ్డారు. పోలీ సులు, ఎన్డీఆర్ఎఫ్, సైనిక బలగాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. 315 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేసి 22 వేల మందిని సురక్షిత ప్రాంతా లకు తరలించారు. అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడడంతో కోచీలోని నేవీ ఎయిర్‌పోర్టును ఓపెన్ చేశారు. భారీ వర్షాల కారణంగా కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 14 జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి కుంభవృ ష్టి కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు మరింత అప్రమత్తమయ్యారు.

కేరళతో పాటు తన నియోజకవర్గమైన వయనాడ్‌ను వరదలు ముంచెత్తడంతో వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధానితో మోదీకి ఫోన్‌ చేశారు. వరదలు, కొండచరియలు విరిగిపడి అతలాకుతలమవుతున్న కేరళను ఆదుకోవాల్సిందిగా కోరినట్టు గాంధీ వయనాడ్ ఎంపీ కార్యాలయం ఓ ట్వీట్‌లో తెలిపింది. రాహుల్ చేసిన అరుదైన ఫోన్ కాల్‌కు ప్రధాని సైతం సానుకూలంగా స్పందించారని, ఎలాంటి సహాయమైనా అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని హామీ ఇచ్చారని ఆ ట్వీట్‌లో పేర్కొంది.

ఇప్పటికే విలయతాండవం ఆడుతున్న వరుణుడు ఇప్పట్లో కేరళలను వదిలాలేడు. వచ్చే రెండురోజులపాటు కేరళలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణకేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారత సైన్యం, వాయుసేన సహాయం అందించాలని కేరళ సీఎం పినరయి విజయన్ కేంద్రాన్ని కోరారు. గడచిన 24 గంటల్లో మున్నార్ నగరంలో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కేరళలో 44 నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు డ్యామ్ లలో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు.

Next Story

RELATED STORIES