నిరుపేద యువతిని అమ్మకానికి పెట్టిన రాక్షసులు

నిరుపేద యువతిని అమ్మకానికి పెట్టిన రాక్షసులు
X

ఆదీవాసీలు, గిరిజనుల పేదరికాన్ని ఆసరగా చేసుకొని యువతులను అక్రమ రవాణా చేస్తున్నారు కొందరు మాయగాళ్లు. పెళ్లి పేరుతో కొందర్ని, పని ఇప్పిస్తామని మరికొందర్ని ఇలా యువతులను ఇతర రాష్ట్రాలకు అక్రమరవాణా చేస్తున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఓ పోలీస్ కానిస్టేబుల్ కూడా పార్ట్ నర్ కావటం విస్మయం కలిగిస్తోంది. యువతులను పశువుల్లా అమ్ముకుంటున్న కిరాతకులను అడ్డుకోవాల్సిన పోలీసు కూడా ఈ పాపంలో పాలుపంచుకోవటం వల్ల ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన సంక్షేమ పథకాలు అక్కడి తండా బ్రతుకులకు ఆసరా ఇవ్వలేకపోతున్నాయి. పైగా మాయమాటలు చెప్పే మోసగాళ్లు ఆ అమాయక గిరిజనుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. తిర్యాణి మండలానికి చెందిన నిరుపేద యువతిని రాజస్థాన్ కు చెందిన వ్యక్తికి అమ్మేశారు. పది వేల జీతం అంటూ నమ్మించి ఆమెను రాజస్థాన్ పంపించారు. తీరా అక్కడకు వెళ్లాక యజమాని చిత్రహింసలు భరించలేక ఎలాగోలా తల్లిదండ్రులకు సమాచారం చేరవేసింది. మోసపోయి కన్నబిడ్డను కసాయికి అప్పగించామని గుర్తించిన ఆ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించటంతో హ్యూమన్ ట్రాఫికింగ్ గుట్టు బయటపడింది.

Next Story

RELATED STORIES